హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్ వినూత్న కార్యక్రమాలను శ్రీకారంచుట్టింది. టీ హబ్ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 16న టీ-స్కేల్ పేరుతో నూతన ప్రోత్సాహక కార్యక్రమాన్ని టీహబ్ ప్రారంభించింది.
దీంతో ప్రారంభ దశలో ఉండి, మరింత విస్తర్ణ కార్యకలాపాలు చేపట్టే స్టార్టప్‌లకు సిరీస్-ఏ ఫండింగ్ ద్వారా అవసరమైన నిధులను సమకూర్చేలా దీన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను టీ హబ్ జారీ చేసింది. అర్హులైన స్టార్టప్ వ్యవస్థాపకులు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ( https://bit.ly/3QXl6P7 )లో సంప్రదించాలని సూచించారు.