Wholesale Inflation | వరుసగా మూడో నెల హోల్ సేల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. జూన్ నెల హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల కనిష్ట స్థాయి మైనస్ 4.12 శాతానికి పరిమితమైంది. ఆహార వస్తువుల, ఫ్యుయల్, బేసిక్ మెటల్స్ ధరలు తగ్గడం వల్లే టోకు ద్రవ్యోల్బణం తగ్గిందని కేంద్రం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మే నెల టోకు ద్రవ్యోల్బణం మైనస్ 3.48 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ నెలలో అత్యంత గరిష్టంగా 16.23 శాతం హోల్ సేల్ ద్రవ్యోల్బణం రికార్డయింది. 2015 అక్టోబర్ నెలలో అతి తక్కువ టోకు ద్రవ్యోల్బణం మైనస్ 4.76 శాతంగా ఉంది.
మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 4.3 శాతం కాగా, జూన్ నెలలో 4.8 శాతానికి దూసుకెళ్లింది.. అందుకు భిన్నంగా హోల్ సేల్ ద్రవ్యోల్బణం పతనం కావడం గమనార్హం. మినరల్ ఆయిల్స్, ఫుడ్ ఉత్పత్తులు, బేసిక్ మెటల్స్, క్రూడాయిల్, నాచురల్ గ్యాస్, టెక్స్ టైల్స్ ధరలు పడిపోవడం వల్లే జూన్ హోల్ సేల్ ద్రవ్యోల్బణం పడిపోయిందని వాణిజ్య పరిశ్రమల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్యుయల్ అండ్ పవర్ ఇండెక్స్ 12.63 శాతం, ప్రైమరీ ఆర్టికల్స్ 2.87 శాతం, మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తులు 2.71 శాతం, ఫుడ్ ఇండెక్స్ 1.24 శాతం పడిపోయాయి.