Digital Payments | ఆరేండ్లలో డిజిటల్ పేమెంట్స్ రెట్టింపు.. తేల్చేసిన కెర్నీ అండ్ అమెజాన్ పే సంయుక్త సర్వే నివేదిక
Digital Payments | రోజురోజుకు డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి భారత్‌లో డిజిటల్ చెల్లింపులు 7 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నాయని కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వేలో తేలింది.
Digital Payments | రోజురోజుకు డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి భారత్‌లో డిజిటల్ చెల్లింపులు 7 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నాయని కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వేలో తేలింది. ‘హౌ అర్బన్ ఇండియా పేస్’ అనే పేరుతో కెర్నీ, అమెజాన్ పే సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆఫ్‌లైన్ చెల్లింపులు గణనీయంగానే ఉన్నా, ఆన్లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా జరుగుతున్నాయని, పేమెంట్స్ విషయమై కస్టమర్ల ధోరణి శాశ్వతంగా షిఫ్ట్ అవుతున్నదని ఈ అధ్యయనం సారాంశం.
సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది ఆన్ లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సంపన్నులే ఎక్కువగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు. వారు వివిధ రూపాల్లో డిజిటల్ పేమెంట్స్ 80 శాతం చేస్తారని ఈ అధ్యయనం సారాంశం. దేశంలోని 120 నగరాల పరిధిలో 1000 మంది వ్యాపారులతోపాటు ఆరు వేల మందిని సర్వే చేశామని కెర్నీ, అమెజాన్ పే తెలిపాయి.
చిన్న పట్టణాల పరిధిలో 65 శాతం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో 75 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని కెర్నీ-అమెజాన్ పే సంయుక్త సర్వే పేర్కొంది. గత ఐదేండ్లలో రిటైల్ డిజిటల్ పేమెంట్స్ నాటకీయ ఫక్కీలో వృద్ధి చెందాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 300 బిలియన్ డాలర్ల విలువైన పేమెంట్స్ జరిగితే, 2023-24 నాటికి 3.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఆ నివేదిక సారాంశం. కార్డులు, డిజిటల్ వాలెట్లతో డిజిటల్ చెల్లింపుల్లో పాపులారిటీ పెరిగిందని, మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో వీటి వాటా 10 శాతం ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. మిలీనియల్స్, ఎక్స్ జనరేషన్ ప్రజలు అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. స్త్రీ పురుషులు 72 శాతం డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారని పేర్కొంది.
ఇవి కూడా చదవండి :
Xiaomi SU7 EV | త్వరలో భారత్ మార్కెట్లోకి షియోమీ సెడాన్ ఎస్‌యూ7 ఈవీ.. గేమ్ చేంజర్ అవుతుందా..?!
ITR Filing | తప్పుల్లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ చేయాలంటే ఈ టిప్స్ అనుసరిస్తే సరి..!
CRISIL- Crude Oil | క్రూడ్ ధరతో ప్రభుత్వ ఖజానాపై ద్రవ్యలోటు భారం తప్పదా.. క్రిసిల్ ఆందోళన
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

