విదేశీ టీకాలపై దిగుమతి సుంకం రద్దు!

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో విదేశీ కొవిడ్-19 టీకాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా వాటిపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ టీకా ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల ఆరంభంలో భారత్‌కు చేరనున్నది. ఇదే సమయంలో మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు కూడా తమ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. విదేశీ టీకాలపై ప్రస్తుతం 10 శాతం దిగుమతి సుంకం, 16.5 శాతం ఐజీఎస్టీతోపాటు అదనంగా సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జీ విధిస్తున్నారు. దీంతో దేశంలో పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల కంటే విదేశీ కొవిడ్ టీకాలు ఖరీదయ్యే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో విదేశీ కొవిడ్ టీకాలపై 10 శాతం దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం ద్వారా వాటి ధరలను తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

