Hyundai Creta EV | హ్యుండాయ్ నుంచి క్రెటా ఈవీ.. అడాస్ అండ్ 360 డిగ్రీ కెమెరా తదితర ఫీచర్లు స్పెషాలిటీ..?!
Hyundai Creta EV | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ (Hyundai) తన ఎస్యూవీ కారు క్రెటా.ఈవీ ఆవిష్కరణకు సిద్ధమవుతున్నది.
Hyundai Creta EV | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ (Hyundai) తన ఎస్యూవీ కారు క్రెటా.ఈవీ ఆవిష్కరణకు సిద్ధమవుతున్నది. ఈ కారు ఫ్రంట్‌లో ఐడెంటికల్ ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్ (డీఆర్ఎల్) ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐసీఈ వేరియంట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌తోపాటు పలు ఫీచర్లు జత కలుస్తాయి. అయితే కొత్తగా ఆవిష్కరించిన క్రెటా ఫేస్ లిఫ్ట్ మోడల్లో మాదిరిగా కన్వెన్షనల్ రేడియేటర్ బదులు క్లోజ్డ్ ప్యానెల్ ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రెటా 17-అంగుళాల ఎయిరో డిజైన్డ్ అల్లాయ్ వీల్స్ జత చేశారు.
ఫ్రంట్ ఫెండర్ మౌంటెడ్ చార్జింగ్ పోర్ట్, స్మూతెన్డ్ బంపర్ విత్ ట్వీక్డ్ రేడియేటర్ గ్రిల్లె, లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఈవీ బేస్డ్ ఇంటర్ఫేస్, ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ న్యూ గ్రాఫిక్స్, రీవాంప్డ్ సెంటర్ కన్సోల్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, లెవెల్ 2-అడాస్ సూట్, ఫ్రంట్ ప్రొఫైల్ పై మధ్యలో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 55-60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మోటారుతో వస్తున్న ఈ మోటార్ సింగిల్ చార్జింగ్‌తో 450 కి.మీ దూరం ప్రయాణిస్తుందని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

