Holi | ఈ నెల 25న దేశవ్యాప్తంగా హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ నెల 25న సోమవారం దేశవ్యాప్తంగా సెలవు. అంతకు క్రితం రెండు రోజులు మార్చి 23న నాలుగో శనివారం కారణం, మార్చి 24 ఆదివారం కారణంగానూ బ్యాంకులకు సెలవు. అంటే వరుసగా మూడు రోజులు పాటు ఈ నెల 23 నుంచి మార్చి 25 వరకు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి 29, గుడ్ ఫ్రైడే కూడా బ్యాంకులకు సెలవే. ఈ నెల చివరి 10 రోజుల్లో అంటే 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో మొత్తం ఎనిమిది రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.
బ్యాంకులకు సెలవులు ఉన్నా ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కాగా మార్చిలో తొమ్మిది రోజుల పాటు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు. హోలీ కారణంగా స్టాక్ మార్కెట్లో వరుసగా 3 రోజులు పాటు ట్రేడింగ్ జరగదు. శని, ఆదివారాల కారణంగా మార్చి 23, మార్చి 24 తేదీల్లో ఈ బ్యాంకులకు సెలవు తోపాటు మార్చి 25న హోలీ రోజు సెలవు కావడంతో వ్యాపార లావాదేవీలు ఉండవు. గుడ్ ఫ్రైడే రోజు కూడా మార్కెట్ మూసి ఉంటుంది.