Sam Altman | ఎంతపెద్ద హీరోలోనైనా లోపాలుంటాయ్.. జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా శామ్ ఆల్ట్‌మన్..!
Sam Altman | ఎన్విడియా (Nvidia) మాజీ సీఈవో (Former CEO) జెన్సన్ హువాంగ్ (Jensen Huang) తాను హీరోలా భావిస్తానని ఓపెన్ ఏఐ సీఈఓ (Open AI CEO) శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) చెప్పారు. అయితే ఎంతపెద్ద హీరోలో అయినా లోపాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ను తిరిగి బాధ్యతల్లోకి తీసుకోవాలని ఇప్పటికే సిలికాన్ వ్యాలీలో కీలకమైన టెక్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ బోర్డుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
Sam Altman : ఎన్విడియా (Nvidia) మాజీ సీఈవో (Former CEO) జెన్సన్ హువాంగ్ (Jensen Huang) తాను హీరోలా భావిస్తానని ఓపెన్ ఏఐ సీఈఓ (Open AI CEO) శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) చెప్పారు. అయితే ఎంతపెద్ద హీరోలో అయినా లోపాలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఎన్విడియా సీఈవోగా జెన్సన్ హువాంగ్ను తిరిగి బాధ్యతల్లోకి తీసుకోవాలని ఇప్పటికే సిలికాన్ వ్యాలీలో కీలకమైన టెక్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ బోర్డుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ కూడా జెన్సన్కు మద్దతుగా మాట్లాడటం గమనించవలసిన విషయం.
జెన్సన్ లేకుండా ఏఐ విప్లవాన్ని, ఎన్విడియాను ఊహించుకోవడం కష్టమేనని శామ్ ఆల్ట్‌మన్ పేర్కొన్నారు. అయితే జెన్సన్ను తిరిగి సంస్థలోకి తీసుకురావాలా వద్దా..? అనే విషయం చెప్పడానికి తనకు తగినంత పరిజ్ఞానం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 2023లో ఓపెన్ఏఐ నుంచి తనను కొద్దికాలంపాటు తొలగించడాన్ని గుర్తు చేసుకుంటూ.. ఇలాంటి పరిస్థితిపై తనకు వ్యక్తిగతంగా సానుభూతి ఉందని తెలిపారు. ఆ ఘటన జరిగి ఎంతో కాలమైనా నాటి పరిస్థితులు ఎలా ఉండేవో తనకు ఇప్పటికీ గుర్తుందని చెప్పారు.
నాడు పలు కారణాలు చూపి ఓపెన్ ఏఐ బోర్డు శామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించింది. అయితే సిబ్బంది, పెట్టుబడిదారులు ఆల్ట్‌మన్‌కు మద్దతుగా నిలవడంతో కొద్ది రోజులకే తిరిగి సంస్థలోకి తీసుకున్నారు. కాగా, జెన్సన్కు మద్దతిచ్చిన టెక్ దిగ్గజాలలో స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ, యూట్యూబ్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ చెన్ ఉన్నారు. ఎన్విడియాలోని పలువురు ఉద్యోగులు, వాటాదారులు కూడా జెన్సన్ను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sam Altman | ఎంతపెద్ద హీరోలోనైనా లోపాలుంటాయ్.. జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా శామ్ ఆల్ట్‌మన్..!
‘రైతాంగ సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలు’
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం
CNG Gas leak | కోనసీమ జిల్లాలో సీఎన్జీ గ్యాస్ లీక్..సమీప ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు
ఓపీఎస్‌కే మన ఓటు.. భద్రాద్రి కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ధర్నా
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

