Harley Davidson X440 | హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 ధర పెంపు.. ఎంతంటే?!
Harley Davidson X440 | హీరో మోటో కార్ప్.. హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యంతో భారత్ లో తయారు చేసిన హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ధర రూ.10,500 పెంచేసింది. శుక్రవారం నుంచి పెరిగిన ధర అమల్లోకి వస్తుంది.
Harley Davidson X440 | హార్లీ డేవిడ్సన్తో కలిసి ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్.. భారత్‌లో ఆవిష్కరించిన ‘హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 (Harley Davidson X440) ధర పెంచేసింది. గత నెలలో మార్కెట్లో ఆవిష్కరించిన ఈ మోటారు సైకిల్ ధర రూ.10,500 పెంచివేసింది. అన్ని వేరియంట్ల మోటారు సైకిళ్లపై పెరిగిన ధర వర్తిస్తుందని తెలిపింది. అయితే శుక్రవారం నుంచి పెరిగిన ధర అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్.. పరిశ్రమలో ఉత్కంఠను సృష్టించిందని హీరో మోటో కార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా తెలిపారు. బైక్ ప్రారంభ ధర రూ.2.29 లక్షలని చెప్పారు. పెరిగిన ధరతో ఈ బైక్ ధర రూ.2,30,500లకు లభిస్తుందన్నారు.
హీరో మోటో కార్ప్‌తో తొలిసారి మేడిన్ ఇండియా స్కీమ్‌లో భారత్‌లో హార్లీడేవిడ్సన్ డెవలప్ చేసి ఆవిష్కరించింది. గత నెల మూడో తేదీన దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చారు. గత నెల నాలుగో తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కస్టమర్లకు బైక్ టెస్ట్ రైడింగ్ ఆప్షన్ అందిస్తున్నారు.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ స్క్వారిష్ ఫ్యుయల్ ట్యాంక్, రౌండ్ హెడ్ లైట్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, హెడ్ లైట్‌పై రౌండ్ స్పీడో మీటర్, వైడ్ హ్యాండిల్ బార్ విత్ ఇండికేటర్స్ అండ్ మిర్రర్స్, రింగ్ షేప్డ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్, సర్క్యులర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్.. 440 సీసీ ఆయిల్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటది. ఈ ఇంజిన్ గరిష్టంగా 27 బీహెచ్పీ విద్యుత్, 38 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ-20 పెట్రోల్ తోనూ ఈ బైక్ నడుపొచ్చు.
డ్యుయల్ చానల్ ఏబీఎస్ (ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్) విత్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తోంది హార్లీ డేవిడ్సన్ ఎక్స్440. ప్రీ లోడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్, విత్ 18 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రేర్ వీల్ తో వస్తుంది. కాల్స్, మెసేజ్ మేనేజ్మెంట్ కోసం నేవిగేషన్ కోసం టీఎఫ్టీ యూనిట్ విత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఉంటుంది.
రాయల్ ఎన్ ఫీల్డ్ 350 రేంజ్, క్లాసిక్ 350, హంటర్, మీటర్ వేరియంట్ మోటారు సైకిళ్లతోపాటు హోండా సీబీ 350, సీబీ 350 ఆర్ఎస్, బైనెల్లి ఇంపీరియల్ 400, త్వరలో రానున్న ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్స్‌తో హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్ తల పడుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

