Harley Davidson X440 | ఆ బైక్ ధరను భారీగా పెంచేసిన హీరో మోటోకార్ప్.. ఇవాళే కొంటే 10 వేలు ఆదా చేయొచ్చు!
Harley Davidson X440 | హ్యార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 ధరను హీరో మోటోకార్ప్ భారీగా పెంచింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ అన్ని వేరియంట్ల రేటును రూ.10,500 పెంచుతున్నట్టు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. గత నెల పరిచయమైన ఈ బైక్ ఎక్స్‌షోరూం ధరల శ్రేణి రూ.2.29 లక్షల నుంచి 2.69 లక్షలుగా ఉన్నది.
Harley Davidson X440 | న్యూఢిల్లీ, ఆగస్టు 2: హ్యార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 ధరను హీరో మోటోకార్ప్ భారీగా పెంచింది. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ అన్ని వేరియంట్ల రేటును రూ.10,500 పెంచుతున్నట్టు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. గత నెల పరిచయమైన ఈ బైక్ ఎక్స్‌షోరూం ధరల శ్రేణి రూ.2.29 లక్షల నుంచి 2.69 లక్షలుగా ఉన్నది. అయితే తాజా నిర్ణయంతో ఈ బైక్ ప్రారంభ ధర రూ.2,39,500లకు చేరుకున్నది.
అయితే గురువారం వరకు పాత ధరలకే బైక్ లభిస్తుందని, బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో హీరో మోటోకార్ప్ స్పష్టం చేసింది. రూ.5,000 చెల్లించి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా చెప్పారు. కాగా, రాజస్థాన్‌లోని నీమ్రాన వద్దనున్న హీరో మోటోకార్ప్ గార్డెన్ ఫ్యాక్టరీలో హ్యార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 బైకులు సెప్టెంబర్ నుంచి తయారు కానున్నాయి. అక్టోబర్ నుంచి డెలివరీలు ఉంటాయి. భారత్‌లో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో హ్యార్లీ-డేవిడ్సన్ బైకులను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

