న్యూఢిల్లీ, మే 8: ఇతర బ్యాంక్లు మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) అధారిత వడ్డీరేట్లను స్థిరంగా ఉంచగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రం సోమవారం కొన్ని కాలపరిమితుల రుణాలపై ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయిం ట్లు (0.15 శాతం) పెంచింది. బ్యాంక్ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం మేరకు ఈ పెంపుదల వెంటనే అమలులోకి వచ్చింది.
ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 7.80 శాతం నుంచి 7.95 శాతానికి, నెల కాలపరిమితిగల రుణంపై 7.95 శాతం నుంచి 8.10 శాతానికి, మూడు నెలలకు 8.40 శాతం, ఆరు నెలలకు 8.80 శాతానికి పెరుగుతుంది.పలు వినియోగ రుణాలకు అనుసంధానించే ఏడాది కాలపరిమితిగల ఎంసీఎల్ఆర్ 8.95 శాతం నుంచి 9.05 శాతానికి చేరుతుంది. రెండేండ్లది 9.10 శాతానికి, మూడేండ్లది 9.20 శాతానికైంది. ఎంసీఎల్ఆర్తో లింకైన వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు (ఫ్లోటింగ్ రేట్ లోన్స్) తీసుకున్న పాత ఖాతాదారులకు దీంతో వడ్డీ భారం పెరుగుతుంది.