Harley-Davidson X440 | హీరో మోటోతో కలిసి హార్లీ డేవిడ్సన్ చౌక మోటార్ సైకిల్.. ఇవీ ఫీచర్లు..?!
Harley-Davidson X440 | దేశీయ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ సాయంతో హార్లీ డేవిడ్సన్.. దేశీయ మార్కెట్లో హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ ఆవిష్కరించింది.
Harley-Davidson X440 | దేశీయ ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్స్ భాగస్వామ్యంతో ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ హార్లీ-డేవిడ్సన్ భారత్ మార్కెట్లో హార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440) ఆవిష్కరించింది. దీని ధర రూ.2.29 లక్షల (ఎక్స్ షో రూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. భారత దేశ మార్కెట్లో దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ, ఐకానిక్ అమెరికా బ్రాండ్ హార్లీ డేవిడ్సన్ కలిసి భారత్ మార్కెట్లో ఎంటరవుతున్న తొలి 440సీసీ సెగ్మెంట్ బైక్ ఇది. హీరో మోటో కార్ప్స్ నీమ్రానా ఫ్యాక్టరీలో ఈ బైక్స్ తయారు చేస్తున్నారు.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మూడు వేరియంట్లలో లభ్యం అవుతున్నది. డెనిమ్, వివిద్, ఎస్ వేరియంట్లలో లభిస్తున్నది. వాటి ధరల వివరాలిలా..
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 డెనిమ్ – రూ.2.29 లక్షలు
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 వివిద్ -రూ.2.49 లక్షలు
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 ఎస్ – రూ.2.69 లక్షలు
డెనిమ్ వేరియంట్ బైక్ మస్టర్డ్ కలర్, వివిద్ వేరియంట్ -మెటాలిక్ థిక్ రెడ్, మెటాలిక్ డార్క్ సిల్వర్ విత్ అల్లాయ్ వీల్స్, ఎస్ వేరియంట్ డెనిమ్ బ్లాక్ కలర్ స్కీమ్ విత్ 3డీ బ్రాండింగ్ అండ్ ప్రీమియం ప్లస్ అల్లాయ్ వీల్స్, గోల్డ్ కలర్డ్ ఇంజిన్ తదితర ఫీచర్లు ఉంటాయి. ‘కనెక్ట్ 2.0’ ప్యాకేజీ కింద మెషిన్ ఇంజిన్ రూపుదిద్దుకుంది. హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ 2-వాల్వ్ ఆయిల్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 27 బీహెచ్పీ, 38 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ తో వస్తుంది.
ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్-సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ యూనిట్ లో టెయిల్ లాంప్, ఎల్ఈడీ యూనిట్లోనే టర్న్ ఇండికేటర్లు, 3.5-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ టీఎఫ్టీ డిజిటల్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. డే అండ్ నైట్ రెండు డిస్ ప్లే మోడ్ల్లో లభిస్తుంది. ‘కనెక్ట్ 2.0’ ఫీచర్ కింద సేఫ్టీ, సెక్యూరిటీ, వెహికల్ హెల్త్, డ్రైవింగ్ రిపోర్ట్ కు సంబంధించి 25కి పైగా నోటిఫికేషన్లు వస్తాయి. బ్లూ టూత్ ఆధారిత టర్న్ బై టర్న్ నేవిగేషన్, కాల్ అలర్ట్స్. ఫైండ్ మై వెహికల్ తదితర ఫీచర్లు ఉన్నాయి. టూరింగ్ సీట్, బ్యాక్ రెస్ట్, బార్ ఎండ్ మిర్రర్స్, బాష్ ప్లేట్, ఫాగ్ లాంప్స్, వైండ్ స్క్రీన్, శాడిల్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

