Harley-Davidson X440 | హార్లీ డేవిడ్సన్ ఎక్స్440పై రూ.15వేల డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్..!
Harley-Davidson X440 |ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ తన ‘హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440)’ మోటారు సైకిల్ మీద రూ.15,000 డిస్కౌంట్ అందిస్తోంది.
Harley-Davidson X440 |ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ తన ‘హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 (Harley-Davidson X440)’ మోటారు సైకిల్ మీద రూ.15,000 డిస్కౌంట్ అందిస్తోంది. భారత్‌లో హీరో మోటో కార్ప్ (Hero Moto Corp) సహకారంతో హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ తయారు చేస్తున్నది. వివిద్ వేరియంట్ పై మాత్రమే లిమిటెడ్ ఆఫర్ గా అందిస్తోందీ డిస్కౌంట్. ఆగస్టు 15 వరకూ డిస్కౌంట్ లభిస్తుందని హార్లీ డేవిడ్సన్ తెలిపింది. త్వరలో 400-500 సీసీ సెగ్మెంట్లో మార్కెట్లోకి వస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ గెరిల్లా 450 (Royal Enfield Guerrilla 450) మోటార్ సైకిల్‌కు పోటీగా హార్లీ డేవిడ్సన్ ఈ డిస్కౌంట్ అందిస్తోంది.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ లాంచింగ్ ధర రూ.2.60 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాగా, డిస్కౌంట్ తో రూ.2.45 లక్షలకే లభిస్తుంది. మిడ్ వేరియంట్ వివిద్ ట్రిమ్ మెటాలిక్ థిక్ రెడ్, మెటాలిక్ డార్క్ సిల్వర్ పెయింట్ స్కీమ్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ మోటారు సైకిల్ 3.5 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్ లెస్ టైర్స్, జియో ఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ తదితర ఫీచర్లు ఉంటాయి.
హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 మోటారు సైకిల్ 440 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 27 బీహెచ్పీ విద్యుత్, 38 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తోంది. 18-అంగుళాల ఫ్రంట్, 17-అంగుళాల రేర్ అల్లాయ్ వీల్స్ తోపాటు అండర్ పిన్డ్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఉంటాయి. ఫ్రంట్ లో కేవైబీ యూఎస్డీ ఫోర్స్, రేర్ లో డ్యుయల్ షాక్ అబ్జార్బర్స్, వేర్వేరు డిస్క్ బ్రేక్స్ విత్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ఉంటాయి. హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 మోటారు సైకిల్ నిర్మిస్తున్న హీరో మోటో కార్ప్.. ఇదే ప్లాట్ ఫామ్ మీద 440 సీసీ మోటారుతో హీరో మార్విక్ 440 బైక్ నిర్మించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

