GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
GST reforms : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు నవంబర్ 1 నుంచి అమలు కానున్నాయి. దీనిలో భాగంగా కీలక మార్పులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని జీఎస్టీ కౌన్సిల్ సిద్ధమైంది.
GST reforms : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు నవంబర్ 1 నుంచి అమలు కానున్నాయి. దీనిలో భాగంగా కీలక మార్పులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని జీఎస్టీ కౌన్సిల్ సిద్ధమైంది. ముఖ్యంగా చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరేలా ఈ సంస్కరణలు ఉండనున్నాయి. నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొన్ని కీలక జీఎస్టీ సంస్కరణలు ఇవి. చిరు వ్యాపారులు తమ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభంగా చేయవచ్చు.
ఈ కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా వ్యాపారులు, వాణిజ్య సంస్థలు తమ సంస్థల్ని సులభంగా రిజిష్టర్ చేసుకోవచ్చు. అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న చిన్న సంస్థలు సులభంగా రిజిష్టర్ చేసుకునే వీలుంది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్ వర్క్ కూడా సులభంగా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. కావాల్సిన డాక్యుమెంట్ల వివరాల్ని కూడా ఈజీగా పొందే వీలుంది. జీఎస్టీ రీఫండ్ కూడా త్వరగా పూర్తవుతుంది. సంబంధిత డాక్యుమెంట్లు సమర్పిస్తే అర్హులైన వారికి జీఎస్టీ రీఫండ్ ప్రక్రియ వెంటనే పూర్తవుతుంది. ఈ విషయంలో ఏ అధికారి సాయం అవసరం లేదు.
జీఎస్టీకి సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు కనీస పరిమితిని రూ.10,000గా నిర్ణయించారు. అనవసర, ఫిర్యాదులు, నిర్వహణ వ్యయాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది జీఎస్టీ కౌన్సిల్. అక్టోబర్ 8న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ట్యాక్స్ చెల్లింపుల ప్రక్రియ సులభంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు తాజా నిర్ణయాల్ని అమలు చేయనున్నారు. అలాగే, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారం చేయాలనుకునేవారికి ఇంతకుముందు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కష్టతరంగా ఉండేది. ఇప్పుడు సులభంగా చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
France Protests | ఫ్రాన్స్‌లో నిరసనలు.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక సూచన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

