న్యూఢిల్లీ, జనవరి 31: గత కొన్ని నెలలుగా పడిపోయిన కీలక రంగాలు మళ్లీ వృద్ధిబాటపట్టాయి. బొగ్గు, ఎరువులు, స్టీల్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడంతో డిసెంబర్ నెలకుగాను మూడు నెలల గరిష్ఠ స్థాయి 7.4 శాతానికి ఎగబాకాయి. అంతక్రితం ఏడాది ఇది 4.1 శాతంగా ఉన్నది. క్రూడాయిల్ ఉత్పత్తి మాత్రం 1.2 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్నది.
నవంబర్ 2022లో ఇది 5.7 శాతంగా ఉన్నది. గత నెలలో బొగ్గు ఉత్పత్తి 11.5 శాతం అధికం కాగా, ఎరువులు 7.3 శాతం, స్టీల్ 9.2 శాతం, విద్యుత్ 10 శాతం పనితీరు కనబరిచాయి. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో(ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలానికి) కీలక రంగాల్లో 8 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది.