మూడు నెలల కనిష్ఠానికి పుత్తడి
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేమితోపాటు రూపాయి కరెన్సీ మరింత బలపడటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీలకు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇదే క్రమంలో గురువారం బంగారం ధర మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,000 తగ్గి రూ.1.48 లక్షలకు పడిపోయింది.
- మరో రూ.1,000 తగ్గిన తులం ధర
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేమితోపాటు రూపాయి కరెన్సీ మరింత బలపడటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీలకు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇదే క్రమంలో గురువారం బంగారం ధర మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,000 తగ్గి రూ.1.48 లక్షలకు పడిపోయింది. గోల్డ్‌తోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి ఏకంగా రూ.5,900 తగ్గి పది నెలల కనిష్ఠ స్థాయి రూ.2,07,500గా నమోదైంది. డిసెంబర్ 18, 2025న నమోదైన రూ.2,07,600 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం విశేషం.
గడిచిన పది నెలల్లో వెండి ఏకంగా రూ.31,500 లేదా 13 శాతం పతనం చెందినట్టు అయ్యాయి. అలాగే ఈ ఏడాది జనవరి 29న నమోదైన రూ.4,04,500 తో పోలిస్తే సగానికి సగం తగ్గింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారంపై సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో వీటి ధరలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన త్రివేదీ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

