BitCoin Crash | బిట్ కాయిన్ క్రాష్.. క్రిప్టో ఎం-క్యాప్ లక్ష కోట్ల డాలర్లు హరీ!
BitCoin Crash | గత నవంబర్ నుంచి బిట్ కాయిన్ భారీగా పతనం కావడంతో క్రిప్టో ఎం-క్యాప్ లక్ష కోట్ల డాలర్ల మేర నష్టపోయింది.

BitCoin Crash | బిట్‌కాయిన్‌తోపాటు ఇతర డిజిటల్ క్రిప్టో కరెన్సీలు శనివారం ట్రేడింగ్‌లో కనిష్ఠ స్థాయికి పతనం అయ్యాయి. ఫలితంగా క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్లకు పైగా నష్టపోయింది. క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ 35వేల డాలర్ల వద్ద తచ్చాడుతున్నది. గత నవంబర్ నెలలో 69 వేల డాలర్ల చేరువలో ఆల్‌టైం రికార్డు నమోదు చేసిన తర్వాత బిట్ కాయిన్ 40 శాతానికి పైగా పతనమైంది.
మార్చిలో కీలక వడ్డీరేట్లు పెంచుతామని అమెరికా ఫెడ్ రిజర్వు ప్రకటించడంతో ఇన్వెస్టర్లు సురక్షిత ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు పతనం కావడం గమనార్హం. ఇతర క్రిప్టో టోకెన్లు ఎథీరియం, బినాన్స్ కాయిన్, కార్డనో కూడా నష్టపోయాయి. ఇంకా సొలానా, డోజ్ కాయిన్, శిభా ఇను వంటి టోకెన్లు భారీగా పతనం అయ్యాయి. 36 వేల డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్‌కు 30 వేల డాలర్ల వద్ద కూడా సపోర్ట్ లభించకపోవచ్చునని ఒయాండా అనలిస్ట్ ఎడ్వర్డ్ మోయా చెప్పారు.
గత నవంబర్ నుంచి బిట్ కాయిన్ విలువ 600 బిలియన్ డాలర్లకు పైగా పతనం అయింది. ఐఎంఎం రీసెర్చ్ ప్రకారం క్రిప్టో కరెన్సీలతో వివిధ దేశాల ఆర్థిక సుస్థిరతకు ముప్పుని తెలుస్తున్నది. క్రిప్టో కరెన్సీల ముప్పును నివారించడానికి సమగ్రంగా సమన్వయంతో కూడిన గ్లోబల్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ అవసరం అని చెబుతున్నారు. 2017లో 620 బిలియన్ల డాలర్లుగా ఉన్న క్రిప్టో- మార్కెట్ క్యాపిటలైజేషన్ గత నవంబర్‌లో 3 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bit coin
- crypto currency
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

