రికార్డుస్థాయికి విదేశీ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఈ నెల తొలివారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు చారిత్రక గరిష్ఠ స్థాయి 785.706 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంతో పోలిస్తే 44.903 బిలియన్ డాలర్లు అధికమైనట్టు వెల్లడించింది.
- 785 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ రిజర్వులు
- గతవారంలో 45 బిలియన్ డాలర్ల పెరుగుదల
ముంబై, సెప్టెంబర్ 11: విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. ఈ నెల తొలివారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు చారిత్రక గరిష్ఠ స్థాయి 785.706 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంతో పోలిస్తే 44.903 బిలియన్ డాలర్లు అధికమైనట్టు వెల్లడించింది. అంతక్రితం వారంలో రిజర్వులు 11.475 బిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. దేశీయ కరెన్సీ విలువ రూపాయి ఒత్తిడికి గురికావడం, డాలర్ అమ్మకాలు అధికంగా ఉండటంతో వీటిని నియంత్రించడానికి రిజర్వుబ్యాంక్ జోక్యం చేసుకున్నది. దీనికి తోడు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రారంభమైన నాటి నుంచి తగ్గుతూ వచ్చిన రిజర్వులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నెల 4తో ముగిసిన వారాంతానికిగాను విదేశీ కరెన్సీ ఆస్తుల విలువ 47.498 బిలియన్ డాలర్లు అధికమై 648.168 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
తగ్గిన గోల్డ్ రిజర్వులు
గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన బంగారం రిజర్వులు తగ్గుముఖం పట్టాయి. గత వారాంతానికిగాను గోల్డ్ రిజర్వులు 2.594 బిలియన్ డాలర్లు తరిగిపోయి 113.816 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

