X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
X Money | ఇక నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్ (X)' ద్వారా కూడా డబ్బులు పంపించవచ్చు. ఈ మేరకు ఎక్స్ చీఫ్ (X Chief) ఎలాన్ మస్క్ (Elon Musk) తమ యూజర్ల కోసం ఆసక్తికరమైన ఫీచర్‌ను ప్రతిపాదించారు. ఎక్స్‌లో ఏదైనా పోస్ట్ నచ్చితే దాని కింద ఉన్న 'లైక్ బటన్'ను లాంగ్ ప్రెస్ (Long press) చేయడం ద్వారా ఆ పోస్ట్ చేసిన వారికి ఒక డాలర్ (One Dollar) పంపే సౌకర్యాన్ని తీసుకువస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.
X Money : ఇక నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్ (X)’ ద్వారా కూడా డబ్బులు పంపించవచ్చు. ఈ మేరకు ఎక్స్ చీఫ్ (X Chief) ఎలాన్ మస్క్ (Elon Musk) తమ యూజర్ల కోసం ఆసక్తికరమైన ఫీచర్‌ను ప్రతిపాదించారు. ఎక్స్‌లో ఏదైనా పోస్ట్ నచ్చితే దాని కింద ఉన్న ‘లైక్ బటన్’ను లాంగ్ ప్రెస్ (Long press) చేయడం ద్వారా ఆ పోస్ట్ చేసిన వారికి ఒక డాలర్ (One Dollar) పంపే సౌకర్యాన్ని తీసుకువస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ ఫీచర్ ద్వారా సులభంగా చిన్న మొత్తంలో డబ్బు పంపించుకునే అవకాశం కలుగుతుంది.
ఎక్స్‌ను కేవలం సోషల్ నెట్వర్కింగ్ వేదికగానే కాకుండా ఫైనాన్షియల్ సర్వీసులతో కూడిన ఒక ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చాలన్న మస్క్ విస్తృత వ్యూహంలో ఈ కొత్త ఫీచర్ ఒక భాగమని తెలుస్తున్నది. ఎక్స్ మనీ ద్వారా ఒకరికి 1 డాలర్ పంపడానికి, లైక్ బటన్‌పై లాంగ్ ప్రెస్ చేసే సదుపాయాన్ని తీసుకొస్తున్నామని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫీచర్ ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లకు టిప్స్ ఇవ్వడానికి, వినియోగదారులకు నచ్చిన పోస్టులను ఆర్థికంగా ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఈ చెల్లింపుల ప్రక్రియ ‘ఎక్స్ మనీ’ ద్వారా జరుగుతుంది. ఇటీవల అమెరికాలో ప్రారంభమైన ‘ఎక్స్ మనీ’ సేవలు పీర్-టు-పీర్ నగదు బదిలీలకు, డిజిటల్ చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. దీంతోపాటు, ఫిజికల్, డిజిటల్ లావాదేవీలకు ఉపయోగపడే ‘ఎక్స్ వీసా డెబిట్ కార్డ్’ను కూడా అందిస్తున్నారు. ఈ కార్డును యాపిల్ పేకు సైతం లింక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ‘ఎక్స్ మనీ’ సేవలు, కొత్తగా ప్రతిపాదించిన ఈ ‘లైక్’ బటన్ పేమెంట్ ఫీచర్ కేవలం అమెరికా మార్కెట్‌కే పరిమితం.
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లలో ఒకటైన భారత్ సహా ఇతర దేశాల్లో ఈ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. ఈ కొత్త ఫీచర్ అమలుకు సంబంధించిన పూర్తి వివరాలు, కాలపరిమితిని కూడా వెల్లడించాల్సి ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

