Electric Cars | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ వాహనాలకు పెద్దపీట వేసిన కొనుగోలుదారులు ఇక ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇంధన ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో కొత్తగా కార్లను కొనుగోలు చేసేవారు ఈవీలకు ఓటు వేస్తున్నారు. ఇటీవలకాలంలో వీటి అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతుండటంతో ఆటోమొబైల్ సంస్థలు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. దీంట్లోభాగంగా నూతన సంవత్సరంలో రూ.11 లక్షల నుంచి రూ.40 లక్షల లోపు ధర కలిగిన టాప్-5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే..
మహీంద్రా ఎక్స్‌యూవీ ఈ8
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మధ్యస్థాయి, ఎక్స్‌యూవీ 700ని ఈవీ రూపంలో ఎక్స్‌యూవీ.ఈ8ని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. రెండు బ్యాటరీలు 60 కిలోవాట్లు, 80 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈ మాడల్ రూ.35-40 లక్షల మధ్యలో ధర ఉండనున్నది.
సిట్రాయిన్ సీ3ఎక్స్
సిట్రాయిన్ సెడాన్ సీ3ఎక్స్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్లో విడుదల చేయబోతున్నది. ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానున్న ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉండనున్నది. 44 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 350 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది. ఆరు వరకు ఎయిర్బ్యాలలు, రివర్స్ కెమెరా వంటి ఫీచర్స్‌తో రూపొందించింది.
మారుతి సుజుకీ ఈవీఎక్స్
మారుతి సుజుకీ తన తొలి ఈవీ మాడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నది. ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి రానున్న ఈ ఎస్యూవీ మాడల్ ఆటో ైక్లెమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్స్‌తో తయారు చేస్తున్నది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కలిగిన ఈ కారు రూ.22 లక్షల నుంచి రూ.28 లక్షల మధ్యలో ధర ఉండొచ్చును.
టాటా పంచ్ ఈవీ
టాటా మోటర్స్.. సరికొత్త ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే కలిగిన ఈ మాడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీలు తిరిగే కెమెరా, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ కలిగిన ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 421 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఈ కారు రూ.11 లక్షల నుంచి రూ.15.5 లక్షల గరిష్ఠ స్థాయిలో లభించనున్నది.
టాటా కర్వ్..
టాటా సరికొత్త ఈవీ మాడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈవీల పరిధిని మరింత విస్తరించే ఉద్దేశంలో భాగంగా నూతన కర్వ్ ఈవీ మాడల్‌ను తీర్చిదిద్దింది. 30 కిలోవాట్ల నుంచి 40.5 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యంతో ఈ మాడల్‌ను తయారు చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్న ఈ మాడల్ రూ.20-25 లక్షల ధరల్లో లభించనున్నది.