న్యూఢిల్లీ : అడ్వంచర్, స్పోర్టీ బైక్‌లకు ఆదరణ పెరుగుతుండటంతో పలు విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు తమ గ్లోబల్ బ్రాండ్లను భారత్‌లో ప్రవేశపెడుతున్నాయి. ఇదే ఒరవడిలో డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్పీ బైక్‌ను డుకాటి ఇండియా లాంఛ్ చేసింది. రూ 34.99 లక్షల ప్రారంభ ధరతో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది.
ఎస్పీ గ్లోబల్ వెర్షన్లో కనిపించే కార్బన్ వీల్స్‌ను దేశీ బైక్‌లో ప్రవేశపెట్టలేదు. స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్పీ (స్పోర్ట్ ప్రొడక్షన్)ను అలాయ్ వీల్స్ కంటే 900 గ్రాముల తేలికైన ఫోర్జడ్ మెగ్నీషియం అలాయ్ వీల్స్‌తో పాటు లైటర్ లిథియం ఇయాన్ బ్యాటరీ, కార్బన్ ఫైబర్ హీల్ ఆర్ట్ వంటి ఫీచర్లతో తక్కువ బరువు కలిగి ఉండి కస్టమర్లను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ఎస్పీ బైక్‌ను వింటర్ టెస్ట్ పెయింట్ స్కీమ్‌తో స్పోర్టీ, అడ్వంచర్ లుక్‌ను తీసుకువచ్చారు. న్యూ డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్పీ బైక్‌కు దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.