ఇటలీకి చెందిన బైకుల తయారీ సంస్థ డుకాటీ.. దేశీయ మార్కెట్లోకి స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్పీ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ఎక్స్‌షోరూం ధర రూ.34.99 లక్షలు. 1103 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ బైకు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద లభించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 208 హెచ్‌పీ పవర్ కలిగిన ఈ బైకు 9,500 ఆర్పీఎం ఇవ్వనున్నది.