పోస్టాఫీస్ ఎంఐఎస్.. రికరింగ్ డిపాజిట్లతో ఇవీ లాభాలు..
పోస్టాఫీస్ | మీరు సీనియర్ సిటిజన్‌గా నికరమైన, స్థిరమైన నెలవారీ ఆదాయం కోసం వేచి చూస్తున్నారా.. అయితే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం ....

న్యూఢిల్లీ: మీరు సీనియర్ సిటిజన్‌గా నికరమైన, స్థిరమైన నెలవారీ ఆదాయం కోసం వేచి చూస్తున్నారా.. అయితే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం (పీవోఎంఐఎస్) సీనియర్ సిటిజన్ల పొదుపుకు గుడ్ ఆప్షన్. ఈ స్కీం కింద 6.60 శాతం వడ్డీరేటు లభిస్తుంది. కనిష్ఠంగా రూ.1000 వరకు డిపాజిట్ చేయొచ్చు. గరిష్ఠంగా సింగిల్ ఖాతాపై రూ.4.5 లక్షలు.. జాయింట్ ఖాతాపై రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. పీవోఎంఐఎస్లో వచ్చే ఆదాయాన్ని రికరింగ్ డిపాజిట్లో మదుపు చేస్తే మరింత లాభాలున్నాయి.
ఐదేండ్లకు పీవోఎంఐఎస్ రిటర్న్స్
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీం ఐదేండ్లకు మెచ్యూర్ అవుతుంది. కానీ ఏడాది తర్వాత ముందస్తుగా విత్‌డ్రా కావచ్చు. అయితే రెండు శాతం ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. పీవోఎంఐఎస్ కింద వచ్చే వడ్డీపై ఆదాయం పన్ను భారం పడుతుంది.
మీకు సేవింగ్స్ ఖాతా ఉన్న పోస్టాఫీసు బ్రాంచ్‌లోనే పీవోఎంఐఎస్ ఖాతాను తెరిస్తే బావుంటుంది. నెలవారీ వడ్డీ ఆదాయం నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. దాన్ని మీరు ప్రతి నెలా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇలా పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీం
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) స్కీం కింద 5.8 శాతం వడ్డీ లభిస్తుంది. క్యాష్ ద్వారా కానీ, చెక్ ద్వారా గానీ ఖాతా తెరవచ్చు. కనిష్ఠంగా రూ.100 జమ చేయాలి. గరిష్ఠ పరిమితి లేదు. ఒక పోస్టాఫీసు బ్రాంచ్ నుంచి మరో పోస్టాఫీసు శాఖకు ఈ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. ఖాతా ప్రారంభించిన మూడేండ్ల తర్వాత ముందస్తు క్లోజింగ్ చేసేయొచ్చు. పోస్టాఫీసుల్లో ఆర్డీ ఖాతాల ప్రారంభంపై పరిమితుల్లేవు. బ్యాలెన్స్ మొత్తంపై 50 శాతం రుణం మంజూరవుతుంది.
ఆర్డీ కంటే పీవోఎంఐఎస్తోనే గరిష్ట లాభాలు ఇలా
పీవోఎంఐఎస్ నుంచి వచ్చే రిటర్న్స్ ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. ఇన్వెస్టర్లు గరిష్ఠంగా పీవోఎంఐఎస్ ఖాతా ద్వారా లాభపడొచ్చు. నెలవారీ ఆదాయ పథకం నుంచి నెలవారీ చెల్లింపులకు రికరింగ్ డిపాజిట్‌ను ఉపయోగించుకోవచ్చు. పీవోఎంఐఎస్పై వడ్డీ నెలకోసారి చెల్లిస్తారు. ఇన్వెస్టర్ ఒకేసారి వడ్డీ మొత్తం తీసుకోవాలనుకున్నా అదనపు ప్రయోజనాలు లభించవు. రూ.4.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్ పొదుపు మొత్తం ఐదేండ్లలో రూ.1,48,500 అవుతుంది. దీనిపై నెలకు రూ.2,475 వడ్డీ లభిస్తుంది. నెలవారీ వడ్డీ ఆదాయాన్ని రికరింగ్ డిపాజిట్ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ మరింత పెరుగుతాయి.
పీవోఎంఐఎస్ ఇలా
ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ.4.5 లక్షలు
నెలవారీగా లభించే వడ్డీ:రూ.2,475
టెన్యూర్-ఐదేండ్లు
మొత్తం లభించే వడ్డీ మొత్తం: రూ.1,48,500
అమలు చేసే వడ్డీ 6.60 శాతం
ఈ నెలవారీగా వచ్చే వడ్డీని పోస్టాఫీసు ఆర్డీ ఖాతాలో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఐదేండ్ల తర్వాత మొత్తం వడ్డీ ఆదాయం రూ.2,400, రూ.1,48,500 కలుపుకుంటే రూ. 172,500 అవుతుంది.
ఆర్డీపై వచ్చే వడ్డీ ఆదాయం
నెలవారీ వడ్డీ ఆదాయం – రూ. 2,475
ఇన్వెస్ట్మెంట్ వాయిదాలు – 60 నెలలు
మొత్తం ఇన్వెస్ట్మెంట్ గడువు ఐదేండ్లు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

