న్యూఢిల్లీ : భారత్‌లో రూ 5.71 లక్షల ప్రారంభ ధర (ఎంట్రీలెవెల్ లైవ్ ట్రిమ్)తో సిట్రోయెన్ సీ3 లాంఛ్ అయింది. సీ3 రెండు ట్రిమ్స్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. 1.2 లీటర్ టర్బో మోటార్ వెర్షన్ రూ 8.06 లక్షల ఎక్స్‌షోరూం ధరకు అందుబాటులో ఉంది. సీ3 5 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ మ్యాన్యువల్ వంటి రెండు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
సీ3 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఇంకా ఆఫర్లో లేదు. ఈ ఆప్షన్ రాబోయే నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక సిట్రోయెన్ సీ3 టాటా పంచ్, మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి కార్లకు దీటైన పోటీ ఇవ్వనుంది.