China Smart Phones | లక్షల కోట్ల ఇన్‌కం.. పైసా పన్ను ఇవ్వవు.. ఇదీ చైనా కంపెనీల తీరు!
China Smart Phones | చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు రూ.లక్షల కోట్ల ఆదాయం పొందుతున్నా.. కేంద్రానికి పైసా పన్ను చెల్లించట్లేదు.

China Smart Phones | భారత స్మార్ ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలు గట్టిగానే పునాదులేసుకున్నాయి. ప్రత్యేకించి షియోమీ, ఒప్పో, వివో సంస్థలు టాప్‌లిస్ట్‌లో ఉంటాయి. ఇవి లో-బడ్జెట్ నుంచి ప్రీమియం స్మార్ట్ఫోన్ల వరకు కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నాయి. భారత కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో రిటర్న్స్ పొందుతున్న ఈ కంపెనీలు.. దేశాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయట్లేదు. ఏటా భారత కస్టమర్ల నుంచి రూ.లక్ష కోట్ల పై చిలుకు ఆదాయం పొందుతున్నాయి ఈ కంపెనీలు. కానీ సింగిల్ రూపాయి పన్ను కూడా చెల్లించడంలేదు. పన్ను చెల్లింపులకు సంబంధించి చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటున్నాయి. తమ ఆదాయ వివరాలను దాచి పెడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పన్ను ఎగవేత కోసం కీలక సమాచారం ఇవ్వట్లేదు. అదే టైంలో భారత్ మార్కెట్లో దేశీయ కంపెనీలనే ధ్వంసం చేస్తున్నాయి.
రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అవకతవకలు
చైనా కంపెనీలు కొన్నేండ్లుగా రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో అవకతవకలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంపెనీల వ్యాపార పద్దతులపైనా విచారణ మొదలైంది. ఇటీవల చైనా ఫోన్ కంపెనీల ఆఫీసులపై పలు దర్యాప్తు సంస్థలు దాడులు చేసి సోదాలు జరిపాయి. తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేపట్టింది. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీల లావాదేవీలపై ఆదాయం పన్నుశాఖ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు చేస్తున్నాయి.
2019-20లో ఎం-క్యాప్ లక్ష కోట్లు
2019-20 ఆర్థికసంవత్సరంలో ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్షకోట్ల పైమాటే. కానీ నికర సంపదను నెగెటివ్‌గా చూపుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. వివో, ఒప్పో.. 2016-17 నుంచి తమ నికర ఆదాయం నెగెటివ్‌లోనే ఉందని చూపుతున్నాయి. భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లీడర్నని చెప్పుకుంటున్న షియోమీ.. భారీ నష్టాలు చూపుతున్నది. 2018-19లో రూ.2447 కోట్లు, 2019-20లో 3,277 కోట్ల నష్టాలు చూపింది.
భారత్ మార్కెట్‌పై డ్రాగన్ కంపెనీల ఆధిపత్యం
షియోమీ, వివో, ఒప్పో తదితర చైనా కంపెనీలు దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు భారత మార్కెట్లో దేశీయ కంపెనీల వాటా 10 శాతం లోపే. స్థానిక కంపెనీల పునాదులను డ్రాగన్ కంపెనీలు బలహీన పరుస్తున్నాయి. లావా, కార్బోన్, మైక్రోమాక్స్, ఇంటెక్స్ వంటి సంస్థల సేల్స్ శరవేగంగా పడిపోయాయి. వీటి మార్కెట్ షేర్ 10 శాతం లోపే. ఫోన్ల పంపిణీ వ్యవస్థలో స్థానిక కంపెనీలతో చైనా కంపెనీలు చేతులు కలపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చైనా కంపెనీలు సప్లయర్లుగా ఉన్నాయి. విడి భాగాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో పారదర్శకత లేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

