ఫ్యూచర్ రిటైల్, బియానీలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు
ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, దానికి ప్రమోటర్లు, ఎండీలు, ఈడీలు, గ్యారంటీర్లుగా వ్యవహరిస్తున్న కిశోర్ బియానీ, రాకేశ్ బియానీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రూ.904.32 కోట్ల బ్యాంక్ మోసం కేసులో ఇది దాఖలైంది.
న్యూఢిల్లీ, నవంబర్ 6: ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, దానికి ప్రమోటర్లు, ఎండీలు, ఈడీలు, గ్యారంటీర్లుగా వ్యవహరిస్తున్న కిశోర్ బియానీ, రాకేశ్ బియానీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రూ.904.32 కోట్ల బ్యాంక్ మోసం కేసులో ఇది దాఖలైంది. ఈ క్రమంలోనే శుక్రవారం ముంబైలో కిశోర్ బియానీకి చెందిన వివిధ ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద బియానీ సోదరులపై మోసం, నేరపూరిత కుట్ర అభియోగాలను మోపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. ఎస్బీఐతోపాటు మరో 9 బ్యాంక్‌ల నుంచి రుణాలను పొందడానికి అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. మొత్తం ఈ కేసులో రూ.2,236.23 కోట్ల నష్టం బ్యాంకులకు వాటిల్లినట్టు చెప్తున్నారు. ఇదిలావుంటే రహేజా బిల్డర్స్, దాని ప్రమోటర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. గృహ కొనుగోలుదారులను ముంచిన కేసులోనే చర్యలు చేపట్టింది
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

