Harley-Davidson X440 | హీరో హ్యార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ అడ్వాన్స్ బుకింగ్స్ బంద్..! కారణం ఏంటంటే..?
Harley-Davidson X440 | హ్యార్లీ డేవిడ్సన్ కంపెనీ హీరో మోటోకార్ప్‌తో కలిసి సంయుక్తంగా ఎక్స్440 మోటార్‌సైకిల్‌ను విడుదల చేస్తున్నాయి. బైక్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల నుంచి ప్రారంభమైంది. బుకింగ్‌కు విశేష స్పందన లభిస్తున్నది.
Harley-Davidson X440 | హ్యార్లీ డేవిడ్సన్ కంపెనీ హీరో మోటోకార్ప్‌తో కలిసి సంయుక్తంగా ఎక్స్440 మోటార్‌సైకిల్‌ను విడుదల చేస్తున్నాయి. బైక్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల నుంచి ప్రారంభమైంది. బుకింగ్‌కు విశేష స్పందన లభిస్తున్నది. వాహనదారుల నుంచి భారీగా డిమాండ్ ఉండడంతో ఆగస్టు 3వ తేదీ వరకు బుకింగ్ విండోను మూసివేస్తున్నట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. అయితే, ఎన్ని బుకింగ్స్ వచ్చాయో మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రీ బుక్ చేసిన కస్టమర్ల కోసం కంపెనీ టెస్ట్ రైడ్స్‌ను ప్రారంభించనున్నది. ఆగస్టు 3 వరకు బుక్ చేసుకున్న వారికి అక్టోబర్ నుంచి డెలివరీ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది.
రూ.5వేలు చెల్లించి కంపెనీ వెబ్సైట్లో Harley-Davidson X440ని బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, త్వరలో విడుదల చేయనున్న ఈ బైక్స్‌ను హీరో కొత్తగా 2.0 ప్రీమియం నెట్వర్క్ డీలర్షిప్ ద్వారా డెలివరీ చేయనున్నది. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ సీఈవో నిరంజన్ గుప్తా మాట్లాడుతూ హార్లీ డేవిడ్సన్ ఎక్స్400 బైక్ బుకింగ్స్‌కు భారీ స్పందన వస్తుండడంతో సంతోషంగా ఉందన్నారు. తమ అంచనాలకు మించి బుకింగ్స్ వచ్చాయన్నారు. ఈ క్రమంలో ఆన్లైన్ బుకింగ్ ఛానెల్‌ను తాత్కాలింగా మూసివేయాలని నిర్ణయానికి వచ్చామన్నారు. బైక్స్ డెలివరీకి సిద్ధమవుతున్నాయన్నారు. హీరో మోటోకార్ప్ ఈ బైక్స్‌ను రాజస్థాన్‌లోని నీమ్రానా ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తుంది.
అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్స్440 ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలిపింది. ఇక హార్లీ డేవిడ్సన్ ఎక్స్440 బైక్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నది. డెనిమ్, వివిడ్, ఎస్. ఈ మోడల్స్ ఇంట్రడక్టరీ ఎక్స్ షో రూమ్ ధరల విషయానికి వస్తే, డెనిమ్ వేరియంట్ రూ. 2.29లక్షలు, వివిడ్ వేరియంట్ రేటు రూ. 2.49 లక్షలు కాగా.. ఎస్ వేరియంట్ ధర రూ.2.69 లక్షలుగా నిర్ణయించారు. ఈ హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 బైక్‌కు ప్రత్యేకంగా భారతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించగా.. ధర సైతం ఇప్పటివరకు వచ్చిన హార్లీ డేవిడ్సన్ బైక్స్ కన్నా తక్కువ ఉండడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

