Bit Coin | బిట్‌కాయిన్ భారీగా పతనం.. ఫెడ్ వల్లేనా.!
Bit Coin | కీలక వడ్డీరేట్లు పెంచుతామని ఫెడ్ రిజర్వు ప్రకటించడం.. స్టాక్స్‌లో ఒత్తిళ్లతో బిట్ కాయిన్ విలువ భారీగా పతనమైంది.

Bit Coin | కొన్ని రోజులుగా క్రిప్టో కరెన్సీల విలువలు భారీగా పతనం అవుతున్నాయి. ప్రత్యేకించి క్రిప్టో మేజర్ బిట్ కాయిన్.. శుక్రవారానికి ఆల్‌టైం రికార్డు విలువ నుంచి 40 శాతం పతనమైంది. సెప్టెంబర్ నుంచి బిట్ కాయిన్ భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. కీలక వడ్డీరేట్లు పెంచనున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వు చేసిన ప్రకటనతోపాటు స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు క్రిప్టో కరెన్సీలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.
కేవలం శుక్రవారం నాడే బిట్ కాయిన్ విలువ 4.9 శాతం పతనమై 41,008 డాలర్లకు చేరింది. గత నవంబర్‌లో నమోదైన ఆల్‌టైం రికార్డుతో పోలిస్తే 40 శాతం తక్కువ. బిట్‌కాయిన్ తర్వాత స్థానంలో ఉన్న ఎథీరియం విలువ 9 శాతం పడిపోగా, బినాన్స్ కాయిన్, సొలానా, కార్డనో, ఎక్స్ ఆర్పీ తదితర కాయిన్ల ధరలు ఏడు రోజుల్లో 10 శాతానికి పైగా పడిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగిన క్రిప్టో కరెన్సీలకు వివిధ దేశాల్లో చట్టబద్ధత లభిస్తుందన్న అంచనాలు, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ, మదుపర్ల పోర్టోఫోలియోలో క్రిప్టోలను పలు దేశాలు చేర్చాయి. దీంతో బిట్ కాయిన్ విలువ గతేడాది 60 శాతం పెరిగింది. ఇప్పటికీ అనిశ్చితిని ఎదుర్కొంటున్న కాయిన్లకు తాజాగా ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- bit coin
- us fed reserve
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

