న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భెల్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. హిందాల్కో ఇండస్ట్రీస్ నుంచి రూ.1,200-1,500 కోట్ల లోపు ఆర్డర్ లభించినట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య లెటర్ ఆఫ్ ఇంటెంట్ జరిగినట్టు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ ఆర్డర్లో భాగంగా 150 మెగావాట్ల రెండు బీటీజీ ప్రాజెక్టుల్లో భాగంగా డిజైనింగ్, ఇంజినీరింగ్, తయారీ, సరఫరా చేయాల్సివుంటుందని పేర్కొంది. ఒడిశాలోని సంబల్పూర్ వద్ద హిందాల్కో నిర్మించతలపెట్టిన ఈ విద్యుత్ ప్రాజెక్టును వచ్చే మూడేండ్లలో నిర్మించనున్నది.