Arnault @ Richest | అత్యంత ధనవంతుడిగా ఆర్నాల్డ్.. మస్క్‌ను అధిగమించి అంతలోనే పడిపోయిన బెర్నార్డ్..
Arnault @ Richest | ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానాన్ని బెర్నార్డ్ ఆర్నాల్ట్ సాధించి కొంతకాలం ఉన్నారు. ఆయన షేర్లు పడిపోవడంతో తిరిగి ఎలాన్ మస్క్ తొలి స్థానానికి చేరారు. ట్విట్టర్ కొనుగోలు తర్వాత మస్క్ నికర విలువ క్షీణిస్తున్నదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.
Arnault @ Richest | ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ నిలిచారు. ఆయన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ను వెనక్కినెట్టారు. అయితే, ఆర్నాల్డ్ షేర్లు పడిపోవడంతో తిరిగి మస్క్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. కొంత కాలం పాటు ప్రపంచ నంబర్ వన్ ధనవంతుడిగా ఆర్నాల్డ్ నిలిచారు. 185.3 బిలియన్ డాలర్ల నికర విలువతో లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఎలాన్ మస్క్‌ను అధిగమించాడు. అయితే, స్టాక్స్ పతనం కారణంగా ఆయన నికర ఆదాయం తగ్గిపోయింది. దాంతో నవంబర్ నెలలో ఆర్నాల్డ్ తిరిగి రెండో స్థానంలో నిలిచాడు.
ఫోర్బ్స్ ప్రకారం, గురువారం ఉదయం బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 184.7 బిలియన్ డాలర్లు. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ నికర విలువ 185.4 బిలియన్ డాలర్లు. దీనిని బట్టి ఎలాన్ మస్క్ ఇప్పటికీ నంబర్ వన్ లోనే ఉన్నట్లు లెక్క. టెస్లా షేర్లలో పెరుగుదల తర్వాత గత ఏడాది నవంబర్ నెలలో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త అయ్యాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టడం ద్వారా మస్క్ ఒకటో స్థానాన్ని సాధించాడు.
ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ నికర విలువ క్షీణిస్తున్నది. నవంబర్ 8న మస్క్ నికర విలువ 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. అలాగే, కరోనా ఆంక్షల కారణంగా టెస్లా చైనాలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. అమెరికా తర్వాత టెస్లాకు చైనా రెండో అతిపెద్ద మార్కెట్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | లారీ ఢీకొని బీటెక్ విద్యార్థి మృతి
Hyderabad | హైదరాబాద్‌లో భారీ పేలుడు శబ్దాలు.. భూకంపం వచ్చిందా? బ్లాస్టింగ్ జరిగిందా?
Cyclone Arnab | అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలో బీచ్‌లను మూసేసిన అధికారులు..!
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. ‘ఆదిపురుష్’తో పోలికలు,ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఎక్కడంటూ కామెంట్
AP News | ‘అర్నబ్’ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధం : ఏపీ హోంమంత్రి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

