Bank Locker | బ్యాంకులో లాకర్ తెరిచారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Bank Locker | బ్యాంకు లాకర్లలో ఖాతాదారులు భద్రపరిచే వస్తువులు, పత్రాల భద్రత కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.

Bank Locker | మీరు మీ విలువైన వస్తువులు, పత్రాలు భద్రపర్చుకునేందుకు బ్యాంకులో లాకర్ తెరిచారా.. అయితే, ఆయా లాకర్ల నిర్వహణకు బ్యాంకులు కొత్త మార్గదర్శకాలు అమలులోకి తేనున్నాయి. ఇటీవలి వరకు బ్యాంకు లాకర్లలో ఉన్న వస్తువులకు ఆయా బ్యాంకులు బాధ్యత వహించేవి కావు.. దొంగలు బ్యాంక్ లాకర్లు కొల్లగొట్టినా.. సదరు ఖాతాదారులకు నష్ట పరిహారం వచ్చేది కాదు..
నష్టం జరిగితే 100 రెట్లు పరిహారం ఇలా..
కానీ తాజాగా ఖరారు చేసిన మార్గదర్శకాలు.. నిబంధనల ప్రకారం ఏదైనా దోపిడీ జరిగినా, అగ్ని ప్రమాదం సంభవించినా.. ఫ్రాడ్ జరిగి లాకర్లో వస్తువులు పోతే.. ఆ లాకర్‌పై వసూలు చేస్తున్న అద్దెకు 100 రెట్ల పరిహారం ఇవ్వాలన్న నిబంధనను ఆర్బీఐ తీసుకొచ్చింది. అందుకు ఖాతాదారులు.. లాకర్లను అద్దెకు తీసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
బ్యాంకులు.. ఖాతాదారుల నుంచి ఇలా ఫీడ్ బ్యాక్
వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ), వివిధ బ్యాంకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోపాటు టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన పలు ఎక్విప్మెంట్ల ఆధారంగా బ్యాంకింగ్ లాకర్ల నిర్వహణ, వాటి భద్రతపై ఆర్బీఐ నిబంధనలు ఖరారు చేసింది.
ఆ నిబంధనలేంటో ఓ లుక్కేద్దాం..
లాకర్ అద్దెకు తీసుకున్న వ్యక్తి దాన్ని సరిగ్గా నిర్వహిస్తున్నారా.. చార్జీలు చెల్లిస్తున్నారా అన్న విషయాన్ని బ్యాంకులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాయి. సరైన టైంలో లాకర్‌కు రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం బ్యాంకులు.. సంబంధిత వ్యక్తుల నుంచి టర్మ్ డిపాజిట్లు తీసుకుంటాయి.
లాకర్‌పై టర్మ్ డిపాజిట్లు
మూడేండ్ల అద్దెకు సరిపడిన మొత్తం డిపాజిట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో లాకర్లను బ్రేక్ చేయడానికి కూడా చార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే లాకర్లు కలిగి ఉండి.. ఖాతాలు నిర్వహిస్తున్న వారి నుంచి బ్యాంకు మేనేజర్లు టర్మ్ డిపాజిట్లు చేయాలని కోరకపోవచ్చు.
మీరు ముందుగానే లాకర్ తీసుకున్నా.. బ్యాంకులు అందుకు సరిపడా డబ్బు డిపాజిట్ చేసుకుంటాయి. లాకర్ ఉపసంహరించుకున్నప్పుడు ఆ మొత్తం చెల్లిస్తాయి.
మీరు లాకర్లో భద్రపరిచే ఆస్తులు, పత్రాలు బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల గానీ, ఏ ఇతరకారణాల వల్ల గానీ దెబ్బతింటే.. అందుకు బాధ్యత వహిస్తూ సమగ్ర ధృవీకృత విధానం అమలు చేస్తాయి.
దొంగతనం జరగకుండా సేఫ్టీ వ్యవస్థ ఇలా..
ఏదేని దొంగతనం జరిగితే పూర్తి బాధ్యత బ్యాంకర్లదే. అందుకు సరైన భద్రతా చర్యలు చేపడతారు. నూతన నిబంధనల ప్రకారం భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలతో లాకర్లలో భద్రపరిచిన వస్తువులు, పత్రాలు దెబ్బతింటే బ్యాంకులు బాధ్యత వహించవు. కనుక ప్రకృతి వైపరీత్యాల నుంచి లాకర్లకు రక్షణ కల్పించేందుకు సరైన భద్రతా వ్యవస్థను అమలు చేస్తాయి.
ఒకవేళ లాకర్ తీసుకున్న వారు ఎటువంటి ప్రమాదకర వస్తువులను పెట్టకుండా నిషేధిస్తూ లాకర్ ఒప్పందంలో నిబంధన చేరుస్తారు. బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్ ఫ్రాడ్ చేసినా, బ్యాంకు భవనం కుప్పకూలినా లాకర్ అద్దెపై 100 రెట్లు పరిహారం చెల్లిస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
28 నుంచి ప్లిఫ్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ : ఐఫోన్ 12, షియోమి ఫోన్లపై భారీ ఆఫర్లు!
EPFO Balance | పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
Tax on Gratuity | గ్రాట్యుటీ మీద పన్ను ఉంటుందా?
Fuel Price Hike | 2020 మే నుంచి పెట్రోల్, డీజిల్ ధరలెలా పెరిగాయంటే!
పెట్రోల్, డీజిల్ ధరలపై ‘శతాబ్ది ఉత్సవాలు జరుపుకోండి’.. కేంద్రానికి చిదంబరం చురకలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

