
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా అమెజాన్ ఇండియా పెద్ద ఎత్తున సీజనల్ జాబ్స్‌కు తెరతీసింది. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.1 లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను సృష్టించినట్లు గురువారం సంస్థ ప్రకటించింది. కస్టమర్ల ఆర్డర్లను మరింత వేగంగా చేరవేయడానికి హైదరాబాద్‌సహా దేశంలోని ప్రధాన నగరాల్లో కొత్తగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకుంటున్నది. పిక్, ప్యాక్, షిప్పింగ్, డెలివరీ విభాగాల్లో తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది.