భగ్గుమన్న క్రూడ్
- ఒపెక్ నిర్ణయంతో రూ.150కిపైగా
- ఎగిసిన పీపా విలువ

ఫ్రాంక్ఫర్ట్/లండన్, అక్టోబర్ 4: పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్), రష్యా తదితర దాని అనుబంధ దేశాల (ఒపెక్ ప్లస్) నిర్ణయం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్ని ఒక్కసారిగా పెంచేసింది. ప్రస్తుత ఉత్పాదక విధానానికే కట్టుబడి ఉంటామన్న ఒపెక్ ప్లస్ నిర్ణయం.. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధరను 1.97 డాలర్లు లేదా 2.8 శాతం పెంచేసింది. దీంతో బ్యారెల్ విలువ మూడేండ్ల గరిష్ఠాన్ని చేరుతూ 81.48 డాలర్లను తాకింది. న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సేంజ్లోనూ 2.32 డాలర్లు లేదా 3 శాతం ఎగిసి ఏకంగా ఏడేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 78.17 డాలర్లకు చేరింది. భారతీయ కరెన్సీలో ఈ పెరుగుదల రూ.150 నుంచి 175 వరకు ఉన్నది. నవంబర్‌లో రోజుకు 4 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తినే పెంచాలని ఒపెక్ ప్లస్ దేశాలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి.
నిజానికి కరోనా దెబ్బకు కుదేలైన ఆర్థిక వ్యవస్థలు కోలుకోవాలంటే ముడి చమురు ధరలు తగ్గాలని, అందుకు మరింత ఉత్పత్తి మార్కెట్లోకి రావాల్సిన అవసరం ఉన్నదని అమెరికా, భారత్ వంటి దేశాలు కోరుతున్నాయి. అయితే తాజాగా సమావేశమైన ఒపెక్ ప్లస్ దేశాల మంత్రుల బృందం మాత్రం మరోసారి కరోనా ముప్పు పొంచి ఉందన్న అంచనాలనే విశ్వసించింది. ఈ క్రమంలోనే ఉత్పత్తి పెంపుపై తొందరపాటు పనికిరాదన్న భావనను కనబర్చుతూ గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ప్రకటించింది. కరోనాతో వచ్చిపడిన లాక్డౌన్లతో ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం పెద్ద ఎత్తున పడిపోయి గ్లోబల్ మార్కెట్లో ధరలు భారీగా పతనమైన విషయం తెలిసిందే. దీంతో ఒపెక్ ప్లస్ దేశాలకు నష్టాలు మిగిలాయి. అందుకే ఉత్పత్తి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుండగా, మార్కెట్లో ధరలు పరుగులు పెడుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

