ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ మోత

- 33% పెరిగిన ప్లాన్ల ధరలు
న్యూఢిల్లీ, జూలై 22: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను ఏకంగా 33 శాతం పెంచేసింది. ఈ క్రమంలోనే తమ రిటైల్, కార్పొరేట్ వినియోగదారుల కోసం మరిన్ని డాటా ప్రయోజనాలతో గురువారం ఐదేసి కొత్త కనీస నెలసరి ప్లాన్లను పరిచయం చేసింది. వీటన్నింటిలో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతోపాటు ప్లాన్ ధరనుబట్టి అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటివి లభిస్తున్నాయి. అయితే నూతన కస్టమర్ల కోసం ఉన్న రూ.749 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ స్థానంలో రూ.999 ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో మరింత డాటా అందిస్తున్నామని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. కాగా, కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్‌తో డాటా వినియోగం గణనీయంగా పెరగడంతో వినియోగదారులకు లాభించేలా సరికొత్త ప్లాన్లను తెచ్చామన్నది. రూ.1,599 ప్లాన్‌లో రిటైల్ కస్టమర్లకు అపరిమిత డాటాతో రెండు కనెక్షన్లు ఇస్తుండగా, రూ.999 ప్లాన్‌లో 210జీబీ డాటా, మూడు కనెక్షన్ల సౌలభ్యం ఉంటుంది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- airtel
- Business news
- post paid
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

