ఆహారశుద్ధితో 30 వేల ఉద్యోగాలు
రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది.
- రాష్ట్రంలో ఈ రంగంలో భారీ వృద్ధి
- 10 వేల కోట్లకు స్థిర మూలధనం
- గతంతో పోల్చితే ఇది రెట్టింపు
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో ఆహారశుద్ధి పరిశ్రమ స్థిర మూలధనం రూ.4,436 కోట్లు ఉండగా, 2021 నాటికి అది 53 శాతం పెరిగి రూ.6,812 కోట్లకు చేరుకొన్నది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డాటా ప్రకారం.. ఏడేండ్లలో ఈ రంగం రూ.2,376 కోట్ల పెట్టుబడులను ఆకర్శించింది. రానున్న రోజుల్లో మరో రూ.4,900 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో స్థిర మూలధనం రూ.10 వేల కోట్లు దాటిపోనున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థిర మూలధనంతో పోల్చితే ఇది రెట్టింపు.
1,031 యూనిట్లకు 3,038 ఎకరాల భూములు
టీఎస్ఐపాస్ డాటా ప్రకారం ఆహారశుద్ధి రంగంలో 2017-2021 మధ్య 2,140 యూనిట్ల ద్వారా రూ.2,376 కోట్ల పెట్టుబడులు రాగా, 29,841 మందికి ఉద్యోగాలు లభించాయి. ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, డెయిరీ యూనిట్లు, స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్లు తదితరాల్లో అధికంగా పెట్టుబడులు రావడం విశేషం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి రైతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక ఆహారశుద్ధి మండళ్లను ప్రారంభించి, ఆహారశుద్ధి విధానాన్ని ప్రకటించింది.
ప్రారంభానికి సిద్ధంగా 834 మైక్రో యూనిట్లు
ప్రభుత్వం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఆంత్రప్రెన్యూర్ యూనిట్ల ఏర్పాటునకు ప్రోత్సాహకంగా రూ.10 లక్షల వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కల్పిస్తున్నది. నవంబర్ 2022 నాటికి 834 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొలాటరల్ ఫ్రీ లోన్, క్యాపిటల్ గ్రాంట్ తదితర ప్రోత్సాహకాలు అందించింది. ఈ యూనిట్లు ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీటితోపాటు మరో 3,132 యూనిట్లకు అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు.
సాకారమవుతున్న సీఎం సంకల్పం
ఆహారశుద్ధి పరిశ్రమ సాధిస్తున్న అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సాకారమవుతున్నది. వ్యవసాయం, అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రీ, లైవ్ స్టాక్ తదితర రంగాల్లో పెట్టుబడి పెరిగింది. దీంతో ప్రభుత్వం ఆహారశుద్ధి రంగాన్ని ముఖ్యమైన రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించటంతో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆహారశుద్ధి పరిశ్రమలో మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలను పెంపొందించడం, రేషన్ డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడం, ప్రజలకు కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అందించడం, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ ఆహారశుద్ధి పరిశ్రమల ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

