2023 Kawasaki Ninja 300 | మార్కెట్లోకి కవాసాకి నింజా స్పోర్ట్స్ బైక్ విత్ ఇంజిన్ హీట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ..!
2023 Kawasaki Ninja 300 | జపాన్ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ కవాసాకి.. భారత్ మార్కెట్లోకి అప్డేటెడ్ 2023 కవాసాకి నింజా 300 స్పోర్ట్స్ బైక్ ఆవిష్కరించింది.
2023 Kawasaki Ninja 300 | జపాన్ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ కవాసాకి ఇండియా.. భారత్ మార్కెట్లో శనివారం ‘2023 నింజా 300 స్పోర్ట్’ బైక్ ఆవిష్కరించింది. ఈ మోటారు సైకిల్ ధర రూ.3.43 లక్షలుగా నిర్ణయించారు. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా కవాసాకి తన నింజా 300 స్పోర్ట్స్ బైక్ రూపొందించింది. అప్ డేటెడ్ కవాసాకి నింజా 300 బైక్ మూడు రంగుల్లో లభిస్తుంది. లైమ్ గ్రీన్, క్యాండీ లైమ్, మెటాలిక్ మూన్ డస్ట్ గ్రే కలర్స్ లో లభిస్తుంది.
న్యూ కవసాకి నింజా 300 బైక్ 296 సీసీ డీఓహెచ్సీ, లిక్విడ్ కూల్డ్, 8-వాల్వ్ ఇంజిన్ విత్ 4-స్ట్రోక్ పార్లల్ ఫ్యుయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఇంజిన్ 6-గేర్ బాక్స్ కలిగి ఉండటంతోపాటు 39 పీఎస్ విద్యుత్, 26.1 ఎన్ఎం గరిష్ట టార్చి వెలువరిస్తుంది.
మెరుగ్గా పని చేయడానికి వీలుగా డ్యుయల్ చానెల్ ఏబీఎస్, హీట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, రేస్ డెరివ్డ్ క్లచ్, హై-టెన్సిల్ డైమండ్ చేసిస్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, డ్యుయల్ థోట్టిల్ వాల్వ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

