బ్యూటీ బ్లెండర్.. ఇలా సూపర్!
మేకప్ సరిసమానంగా వచ్చేందుకు, అందంగా చర్మం మీద అలముకునేందుకు మేకప్ స్పాంజ్ మంచి సాధనం. అయితే దీన్ని మరింత సులువుగా, ఆరోగ్యకరమైన రీతిలో వాడుకునేందుకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫౌండేషన్, బ్లష్లాంటివి అప్లయ్ చేసేందుకు దీన్ని వాడే ముందు శుభ్రమైన నీళ్లలో బాగా తడపాలి. అంటే స్పాంజ్‌ను గోరువెచ్చటి నీటిలో ముంచాలి.
మేకప్ సరిసమానంగా వచ్చేందుకు, అందంగా చర్మం మీద అలముకునేందుకు మేకప్ స్పాంజ్ మంచి సాధనం. అయితే దీన్ని మరింత సులువుగా, ఆరోగ్యకరమైన రీతిలో వాడుకునేందుకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫౌండేషన్, బ్లష్లాంటివి అప్లయ్ చేసేందుకు దీన్ని వాడే ముందు శుభ్రమైన నీళ్లలో బాగా తడపాలి. అంటే స్పాంజ్‌ను గోరువెచ్చటి నీటిలో ముంచాలి. అది పూర్తిగా నీటిని పీల్చుకున్నాక ఒకసారి మృదువుగా పిండి, టిష్యూ పేపర్ లేదా పొడి టవల్ మీద అద్దాలి. స్పాంజ్ కొద్దిగా తేమగా ఉన్నప్పుడు క్రీములు, లోషన్లను రాసుకునేందుకు వాడాలి. లేకపోతే ఖరీదైన ఉత్పత్తుల్ని అది పీల్చుకుంటుంది. అలాగే పిండేటప్పుడు మెలితిప్పినట్టు కాకుండా మృదువుగా నొక్కాలి.
అలాకాకుంటే స్పాంజ్ పాడైపోతుంది. ఇక, వాడిన తర్వాత కూడా గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్లు లేదా బేబీ షాంపుల లాంటివి, అదీ కాదంటే అచ్చంగా వీటి కోసమే తయారయ్యే బ్యూటీ బ్లెండర్ బార్సోప్లాంటి వాటితో వీటిని శుభ్రపరచాలి. నిజానికి ఈ బ్యూటీ బ్లెండర్లను వాడిన ప్రతిసారీ కడగాలి. అలా కొందరు చేయరు. అలాంటప్పుడు దాని నిండా క్రీములు పేరుకుపోతాయి. బేకింగ్ సోడా, గిన్నెలు తోమే లిక్విడ్ వేసిన నీళ్లలో నానబెట్టి కడిగితే శుభ్రపడుతుంది. మరో విషయం ఏమిటంటే, ఈ మేకప్ స్పాంజ్‌లను ఎప్పుడూ మిగతా సౌందర్యోత్పత్తులతో కలిపి డబ్బాలో వేసి మూత పెట్టకూడదు. లోషన్లను రాసుకునేందుకు వాడే ఇది కాస్త తడిపొడిగా ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. అందుకే పొడి వాతావరణం ఉండే చోటే గాలి తగిలేలా దీన్ని భద్రపరచాలి. ఇలా వాడుకుంటే బ్లెండర్తో పాటు మన చర్మమూ పదికాలాల పాటు భద్రంగా ఉంటుంది.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

