Apps:
Follow us on:

Gray Hair | ఈ చిట్కాలతో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి

1/5చాలామందికి చిన్నవయసులోనే తల వెంట్రుకలు తెల్లగా మారిపోతుంటాయి. దీంతో జుట్టుకు నల్లరంగు వేసుకుంటూ ఉంటారు. తెల్లవెంట్రుకలతో బాధపడేవారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు జుట్టు నల్లగా మారుతుంది.
2/5జుట్టుకు రంగు వేసుకోవాలంటే మొదటగా గుర్తొచ్చేది హెన్నా. ఈ పౌడర్‌ని ఆముదంలో మరిగించాలి. చల్లారాక దీన్ని జుట్టు కుదుళ్లకు అంటేలా రాయాలి. రెండు గంటల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
3/5బ్లాక్ టీతో కూడా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. బ్లాక్ టీపొడిని నీటిలో మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు రాయాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
4/5రాత్రి పడుకునే ముందు ఉసిరికాయ, కుంకుడు కాయ, శీకాకాయల మిశ్రమాన్ని బాగా కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే దాంట్లో మైదాకు కలిపి మరో రెండు గంటలు నానబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.
5/5కాఫీతోనూ తెల్లజుట్టును కవర్ చేయవచ్చు. రెండు టేబుల్‌స్పూన్ల కాఫీ పొడిని కప్పు నీటిలో మరిగించాలి. చల్లారాక స్ప్రే బాటిల్‌లో పోసి జుట్టు కుదుళ్లపై చల్లాలి. తర్వాత మసాజ్ చేసి గంటపాటు షవర్‌క్యాప్ ధరించాలి. తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.