YS Sharmila | ఇది వావివరసలు తెలిసినోడు చేసే పనేనా..? సోదరుడు జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్
YS Sharmila | ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు తండ్రి వయసున్న చంద్రబాబుకు శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా..? అని ప్రశ్నించారు. ఆత్మీయ బంధాలకు అడ్డమైన సంబంధాలు అంటగడతారా..? అని నిలదీశారు.
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు తండ్రి వయసున్న చంద్రబాబుకు శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా..? అని ప్రశ్నించారు. ఆత్మీయ బంధాలకు అడ్డమైన సంబంధాలు అంటగడతారా..? అని నిలదీశారు. ఇది వావివరసలు తెలిసినోడు చేసే పనేనా..? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాజంపట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా..? అని మండిపడ్డారు. మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలేనా అంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
సాక్షి పత్రికలో తనపై రాసిన కథనాన్ని తప్పుపడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పెళ్లి పిలుపులోనూ రాజకీయ కోణం వెదుకుతారా అని షర్మిల మండిపడ్డారు. నాడు తన పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును వైఎస్ ఆహ్వానించారని, అంటే వైఎస్ కూడా చంద్రబాబుతో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా..? అని ప్రశ్నించారు. ఆడబిడ్డలపై నిందలు వేయడమే జగన్ పత్రిక విధానమా..? అని మండిపడ్డారు. ఇది వైసీపీ అండ్ కో నీచపు బుద్ధికి, దిగజారుడు సంస్కారానికి పరాకాష్ట అని అన్నారు.
ఇలాంటి రాతలకు సంజాయిషీ జగన్ ఇస్తారా.. సాక్షితో ఇప్పిస్తారా..? అని షర్మిల ప్రశ్నించారు. సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరమని విమర్శించారు. తనకు, తన కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననమని అభివర్ణించారు. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రికలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్థించుకుంటారు..? అని నిలదీశారు. ఆత్మీయ బంధాలకు తప్పుడు అర్థాలు వెతుకుతున్నారంటే మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో అర్థమవుతోందని ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | ఇది వావివరసలు తెలిసినోడు చేసే పనేనా..? సోదరుడు జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్
‘కాంగ్రెస్ 420 హామీలు తక్షణమే అమలు చేయాలి’
Gold Dollar | శ్రీ పద్మావతి అమ్మవారికి రూ.10 లక్షల విలువైన బంగారు డాలర్ విరాళం
పింఛన్ల పెంపు ఏదీ ? : లకావత్ గిరిబాబు
వడ్డేపల్లి దామోదర్ రెడ్డి మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

