Pithapuram | పిఠాపురం అభ్యర్థికి మంత్రి పదవి ఆఫర్ చేసిన జగన్!
Pithapuram | ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు పిఠాపురంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాటిచ్చారు. అలాగే కుప్పంలో భరత్ గెలస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు.
Pithapuram | ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం నాడు పిఠాపురంలో పర్యటించిన ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాటిచ్చారు. అలాగే కుప్పంలో భరత్ గెలస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు.
పిఠాపురంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో జగన్ మాట్లాడుతూ.. చిన్న జలుబు చేస్తేనే పిఠాపురం నుంచి హైదరాబాద్‌కు పారిపోయాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో దత్తపుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా అని ప్రశ్నించారు. ఆయన్ను మహిళలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఐదేండ్లకు ఒకసారి కార్లు మార్చినట్లుగా దత్తపుత్రుడు భార్యలను మార్చేస్తాడని విమర్శించారు. ఈయన ఎమ్మెల్యే అయితే మహిళలు కలిసే పరిస్థితి ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇప్పటికే గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం మిగిలిందని ఎద్దేవా చేశారు.
కాగా, ఈ మీటింగ్‌లోనే పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత ఎమోషనల్ అయ్యారు. తాను పిఠాపురంలో పుట్టలేదని అవమానిస్తున్నారని.. నియోజకవర్గానికి దూరం చేస్తున్నారని కంటతడి పెట్టారు. పిఠాపురమే తన కుటుంబమని.. తన అంతిమ యాత్ర కూడా ఇక్కడే జరగాలని తెలిపారు. మళ్లీ పిఠాపురంలోనే పుట్టి మీ రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తన బిడ్డ సాక్షిగా ప్రమాణం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

