TTD Key Decision | ఇకపై వాళ్లకు వీఐపీ దర్శనం.. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ పాలక మండలి
TTD Key Decision | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి తొలి సమావేశం మంగళవారం టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి (Karunakar Reddy) అధ్యక్షతన జరిగింది.
హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలి తొలి సమావేశం మంగళవారం టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్‌రెడ్డి (Karunakar Reddy) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని అన్నమయ్య భవన్లో పాలకమండలి సమావేశ అనంతరం సమావేశ వివరాలను చైర్మన్ మీడియాకు వివరించారు.
సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి పెంచడానికి అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రామకోటి మాదిరిగా గోవింద కోటి రాయించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. 25 ఏళ్లలోపు యువత గోవింద కోటి (Govinda Koti) ని రాస్తే వారి కుటుంబానికి వీఐపీ దర్శనం (VIP Darsan) కల్పిస్తామని వెల్లడించారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భగవద్గీత పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ముంబాయి బాంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచార కేంద్రం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే 29 స్పెషలిస్ట్, 15 చిన్నపిల్లల వైద్యులతో పాటు 300 మంది ఉద్యోగుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వీటితో పాటు రూ. 2.16 కోట్లతో టీటీడీ ఆస్పత్రుల్లో (TTD hospital) మెడిసిన్ కొనుగోలు, 47 వేద అధ్యాపక పోస్టుల నియామకాలకు పాలకమండలి సమావేశం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
సెప్టెంబర్ 18 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 వరకూ జరుగుతాయని చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. అధిక మాసం కావడం వల్ల అక్టోబర్‌లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు (Brahamotsavam) జరుగుతాయన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 18న ధ్వజారోహణం సందర్భంగా సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అదే రోజు టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు.
రూ. 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పునఃనిర్మాణం, రూ. 49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమత్తు పనులకు నిధులు కేటాయించామన్నారు. పోటులో పెండింగ్‌లో ఉన్న 413 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేయాలని సమావేశం నిర్ణయించినట్లు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉంటున్న కేశవాయనగుంట వద్ద అభివృద్ధి పనులకు రూ.4.15 కోట్లు కేటాయించామన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Uttarakhand: బద్రీనాథ్‌లో హెలికాప్టర్ మిస్సింగ్
Jumanji: Open World | థ్రిల్లింగ్ అడ్వెంచర్‌తో వస్తోన్న ‘జుమాంజి: ఓపెన్ వరల్డ్’.. తెలుగు ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

