కొత్త రికార్డును సొంతం చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్
విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త రికార్డును సొంతం చేసుకున్నది. ఒక రోజులో అత్యధికంగా 7,620 టన్నుల ఉత్పత్తి చేసి కొత్త రికార్డును...
విశాఖ స్టీల్ ప్లాంట్ కొత్త రికార్డును సొంతం చేసుకున్నది. గతంలో తన పేరిటి రికార్డును తిరగరాసింది. ఒకరోజులో అత్యధికంగా ఉత్పత్తి చేసిన రికార్డులను బద్దలు కొట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-1 గోదావరిలో మంగళవాంర పెద్ద మొత్తంలో ఉత్పత్తి జరుగడంతో ఈ రికార్డు విశాఖ స్టీల్ ప్లాంట్ పరమైంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో ఉత్పత్తి విషయంలో అనేక రికార్డులను నెలకొల్పింది. తాజాగా ఒక రోజులో అత్యధికంగా 7,620 టన్నుల ఉత్పత్తి చేసి కొత్త రికార్డును లిఖించింది. గతంలో 2020 ఏప్రిల్ 16 న అత్యధికంగా 7,550 టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక రికార్డు. మంగళవారం నాడు ఈ రికార్డును తిరగరాశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్దమైంది. దీనిపై ఉద్యోగ, కార్మిక సంఘాలతోపాటు రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నారు. తమకు సెంటిమెంట్‌గా ఉన్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని కోరుతున్నారు. తమ ఆందోళనలో భాగంగా ఈ నెల 23 న బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. ఒకవైపు కార్మికుల ఆందోళనలు చేస్తుండగా.. మరోవైపు రికార్డు ఉత్పత్తి చేయడం విశేషం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

