Veligonda Project | వెలిగొండ ప్రారంభోత్సవం రోజే విషాదం.. వరదలో ఒకరు గల్లంతు.. చెట్లెక్కి ముగ్గురి ఆర్తనాదాలు
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజే విషాద ఘటన చోటుచేసుకుంది. నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేసిన నేపథ్యంలో పెరిగిన నీటి ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన బొలెరో వాహనం కొట్టుకుపోయింది. నలుగురిలో ముగ్గురు చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకోగా.. మరో వ్యక్తి గల్లంతయ్యాడు.
Veligonda Project | శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజే విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయడంతో ముంపు ప్రాంతాల్లో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. ఈ ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన బొలెరో వాహనం కొట్టుకుపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిలో ముగ్గురు సమీపంలోని చెట్టుపైకి చేరి ప్రాణాలు కాపాడుకోగా.. మరో వ్యక్తి గల్లంతయ్యాడు.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల ముంపు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించే ప్రక్రియ చేపట్టిన సమయంలోనే నలుగురు వ్యక్తులు అరటి కాయలు కోసేందుకు బయటకు వెళ్లినట్లు సమాచారం. రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోని నీటి ప్రవాహాన్ని బొలెరో వాహనంలో దాటేందుకు ప్రయత్నించారు. నీటి ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వాహనం అదుపుతప్పి వరదలో కొట్టుకుపోయింది. వాహనం నుంచి బయటపడిన నలుగురిలో ముగ్గురు సమీపంలోని చెట్టును పట్టుకుని పైకి ఎక్కారు. ఉధృతి ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి కిందకు దిగే పరిస్థితి లేకపోవడంతో తమను కాపాడాలంటూ సహాయం కోసం కేకలు వేశారు. మరో వ్యక్తి మాత్రం వరద ప్రవాహంలో గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్ విజయ సునీత, డీఎస్పీ యు. నాగరాజు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నప్పటికీ నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వెంటనే చెట్టుపై ఉన్న వారిని చేరుకోవడం కష్టంగా మారింది.
అనంతరం నీటి ప్రవాహాన్ని కొంతమేర తగ్గించే చర్యలు చేపట్టడంతో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. చివరకు చెట్టుపై చిక్కుకున్న ముగ్గుర్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజే ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎయిర్టెల్ అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

