దేశ గమనాన్ని మార్చిన నేత వాజపేయి : చంద్రబాబు
Chandra babu| మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి దేశ గమనాన్ని మార్చిన గొప్ప నేత అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. వాజపేయి వర్ధంతి
అమరావతి : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి దేశ గమనాన్ని మార్చిన గొప్ప నేత అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. వాజపేయి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించా రు. ఆధునిక భారత్ నిర్మాణంలో అటల్జీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
వాజపేయి పాలనా కాలంలో ఊపిరిపోసుకున్న స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, టెలికాం, సూక్ష్మసేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్, ఓపెన్ స్కై పాలసీ, పోర్థుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిన అంశమని పేర్కొన్నారు. దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవేనని అన్నారు.
ప్రధానిగా ఉన్న సమయంలో పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయని గుర్తుకు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ తప్పక తలుచుకోవాల్సిన దేశభక్తుడు వాజపేయి అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

