Tirumala | ఇక భక్తుల చేతికి ఊతకర్ర.. ఆ సమయంలోనే పిల్లలకు నడకమార్గంలో అనుమతి.. కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
Tirumala | తిరుమల నడకమార్గంలో ఇటీవల చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తున్నది. భక్తుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది. కమిటీ తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వివరించారు.
Tirumala | తిరుమల నడకమార్గంలో ఇటీవల చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తున్నది. భక్తుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నది. కమిటీ తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాకు వివరించారు. నడకమార్గంలో రాత్రి 10 గంటలకు వరకు పెద్దవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఘాట్రోడ్లో వెళ్లే ద్విచక్ర వాహనాలకు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంట వరకే తల్లిదండ్రులతో పిల్లలకు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత నడకదారిలో పిల్లలను అనుమతించమని స్పష్టం చేశారు. అలాగే భక్తులను గుంపులుగా పంపాలని నిర్ణయించామని, నడకదారిలో జంతువులకు ఎలాంటి ఆహారం ఇవ్వొద్దని భక్తులకు సూచించారు. ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నడకమార్గంలో లైటింగ్ ఏర్పాట్లు..
భద్రత కోసం డ్రోన్లను సైతం వినియోగించాలని నిర్ణయించామని.. తిరుపతి నుంచి తిరుమల మధ్య 500 కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన చోట్ల డ్రోన్ కెమెరాలు కూడా వాడతామన్నారు. కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన లక్షిత చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిందన్నారు. నడకదారిలో భక్తులకు ఎలాంటి అపాయం లేకుండా చూసేదుకు అటవీశాఖ, పోలీస్‌శాఖలతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామన్నారు. సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అటవీశాఖ సూచనలు చేసిందని చెప్పారు. భక్తులపై చిరుత దాడులపై చర్చించామని, భక్తుల భద్రతలకు నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు. నడకదారిలో ఇరువైపులా లైటింగ్‌తో పాటు బేస్ క్యాంప్, మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.
భక్తుల భద్రతకు ప్రాధాన్యం
భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్నామని, భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇకపై కాలినడకన వెళ్లే ప్రతి భక్తుడికి ఓ ఊతకర్ర ఇవ్వనున్నామని, ఇదే వారికి ప్రధాన ఆయుధమని చెప్పారు. నడకమార్గంలో భక్తులను అప్రమత్తం చేసేలా సైన్బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలిపిరి, గాలిగోపురం, ఏడో మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. భద్రతపై భక్తులకు అవగాహన కల్పిస్తామని, కేంద్ర అటవీశాఖ అధ్యయనం చేసిన తర్వాత ఫెన్సింగ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమలలో దుకాణాలు వ్యర్థాలు పడేయొద్దని, బయట వ్యర్థాలను వదిలేసే షాపులపై చర్యలుంటాయని హెచ్చరించారు. కాలినడకన వెళ్లే వారికి గతంలో మాదిరి టికెట్లు మంజూరు చేస్తామని, 15వేల మందికి ప్రస్తుతం నడకదారి భక్తులకు ఇస్తున్నామని, వాటిని గాలిగోపురం వద్ద చెక్ చేసుకోవాలన్నారు. ఇకపై భూదేవి కాంప్లెక్స్‌లో ఇచ్చే దర్శన టికెట్లు గాలిగోపురం వద్ద చెకింగ్ అవసరం లేదని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

