ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
Alert| తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద ఉద్ధృతి వస్తుండడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
అమరావతి : తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద ఉద్ధృతి వస్తుండడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 17.75అడుగులకు నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు నుంచి పంట కాల్వలకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదేవిధంగా 19 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 18.22 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కోనసీమ జిల్లాలో ఇప్పటికే 37, పశ్చిమగోదావరి జిల్లాలో 13, తూర్పుగోదావరి జిల్లాలో 6 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు స్తంభించాయి. బ్యారేజీతోపాటు లంక గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లోని కంట్రోల్‌రూమ్ నుంచి విపత్తుల నిర్వహణ విభాగం పర్యవేక్షిస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న పి.గన్నవరం, సఖినేటిపల్లి, అయినవిల్లి, అల్లవరం మండలాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, విపత్తుల నిర్వహణ బృందాలను పంపారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 13 లంక గ్రామాల్లోని పలు ఇళ్లు నీట మునగడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏడు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం అందజేస్తున్నారు. నరసాపురం పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పంట భూములు నీట మునిగాయి. అలల ధాటికి ఆక్వా చెరువుల గట్లు దెబ్బతింటున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరరామచంద్రాపురం, ఎటపాక, చింతూరు ,కూనవరం, మండలాల్లో వరద పెరుగుతోంది. ఎటపాక పోలీస్‌స్టేషన్ నీట మునిగింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

