నేటి అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగనున్నాయి.
- రేపు స్వర్ణరథంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిగా దర్శనం
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం అర్ధరాత్రి నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగనున్నాయి. మొదటి మూడు రోజులకు ఆన్లైన్లో ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి టికెట్ల కేటాయింపు పూర్తయింది. మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం భక్తులను నేరుగా దర్శనానికి అనుమతిస్తారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వర్ణరథంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిగా శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.
డిసెంబర్ 31వ తేదీ ఉదయం 5 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. పది రోజులపాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆన్లైన్ ద్వారా సుమారు 25 లక్షల మంది భక్తులు దరఖాస్తు చేయగా, ప్రతి రోజు 60 వేల టోకెన్ల చొప్పున దర్శనాలు కేటాయించినట్టు టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీ నియంత్రణ కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్యూలైన్ నిర్వహణ, నిఘా చర్యలు ముందస్తుగా అమలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

