Visakha Steel | విశాఖ స్టీల్‌లో కార్మికుల తొలగింపునకు నిరసనగా కొనసాగుతున్నఆందోళన
Visakha Steel | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పట్ల కార్మికులు కొనసాగిస్తున్న నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి.
అమరావతి : విశాఖ స్టీల్ (Visakha Steel) ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పట్ల కార్మికులు కొనసాగిస్తున్న నిరసనలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రద్దు చేసిన గేటు పాస్‌లను పునరుద్ధరించాలని కోరుతూ సుమారు 4వేల మంది కార్మికులు ఈడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. బయోమెట్రిక్ యంత్రంలో తొలగించిన కార్మికుల వివరాలు తిరిగి నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ప్లాంటులో 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా అందులో నాలుగు వేల మందిని తొలగించేందుకు యాజమాన్యం సిద్ధం కావడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులతో అధికారులు చర్చలు జరిపినా డిమాండ్లను యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు ఉద్యోగ సంఘ నాయకులు మద్దతు తెలిపి కార్యాలయం ముందు బైఠాయించారు.
కాంట్రాక్టు కార్మికుల విషయంలో యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. యాజమాన్యం చెబుతున్న మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేదని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికుల విషయంలో కుట్ర జరుగుతుందన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

