సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభం
Tirupati|శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభమయ్యాయి.
తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాల్లో మొదటి రోజు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.
రాత్రి ఊంజల్ సేవను నిర్వహించి పెద్దశేష వాహనంపై స్వామి, అమ్మవార్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్లు చెంగల్రాయలు, రమణయ్య ,అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
నిన్న స్వామివారిని 88,682 మంది భక్తులు దర్శించుకోగా 37,447 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ.4కోట్ల 9లక్షల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామి దర్శనానికి వేచి ఉన్నారని వీరికి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
సారపాకలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Drinking Water | చలికాలంలో రోజూ తగినంత నీళ్లను తాగాల్సిందే.. నీరు తగ్గితే ఈ సమస్యలు వస్తాయి..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

