Srisailam Dam | కృష్ణా నదీ ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలశయానికి వరద ప్రవాహం పెరిగింది. బుధవారం ఉదయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం 44,047, సుంకేశుల నుంచి 1,28,985, హంద్రీ నుండి 250 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
బుధవారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయానికి 76,122 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదైంది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం ఏపీ పవర్‌హౌస్‌లో 32,101, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగులు. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.2737 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి.