Pawan Kalyan | విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిలువరించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వారంలో అఖిలపక్షాన్ని పిలువాలని ఏపీ సీఎం వైఎస్ జగన్కు జనసేనాని పవన్ కల్యాణ్ అల్టిమేటం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలువరించడానికి ఏం చేస్తారో వైసీపీ ఎంపీలు స్పష్టం చేయాలన్నారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్రానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖలు రాసినా ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను నిలువరించే విషయమై ప్రభుత్వం స్పందించకపోతే తాము కార్యాచరణ ప్రకటిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.